NDA Manifesto: మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. ఉమ్మ‌డి మేనిఫెస్టో ఇదే

NDA Manifesto: జ‌న‌సేన‌, తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల అధినేతలు కూట‌మి మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. ఈ మేనిఫెస్టోలో తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా అమ‌లు ప‌ర‌చ‌నున్నారు.

కూట‌మి మేనిఫెస్టో ఇదే

మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

ఐదేళ్ల‌లో యువ‌త‌కి 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు

నెల‌కు రూ.3000 నిరుద్యోగ భృతి

స్కూల్‌కి వెళ్లే విద్యార్ధుల‌కు ఏడాది రూ.15000

ప్ర‌తి రైతుకి ఏటా రూ.20000 ఆర్థిక సాయం

ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ.1500 (19 నుంచి 59 ఏళ్ల వారికి)

ఏడాదికి ప్ర‌తి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండ‌ర్లు

మ‌త్య్స‌కారుల‌కు సంవ‌త్స‌రానికి రూ.20,000 ఆర్థిక సాయం

జీవో 2 (2017) ర‌ద్దు

రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు, ఆధునిక క‌మ్యునికేష‌న్ల‌కు ఆర్థిక సాయం

ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌కు నిధులు

చిరు వ్యాపారుల‌కు వ‌డ్డీ లేని రుణాలు

అధికారిక కార్య‌క్ర‌మంగా క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆత్మార్ప‌ణ దినోత్స‌వం

జిల్లాల్లో 5000 నిల్వ సామ‌ర్ధ్యం క‌లిగిన కోల్డ్ స్టోరేజ్‌లు

ట్రాన్స్‌ఫార్మ‌ల ధ‌ర త‌గ్గింపు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు