Chandrababu Naidu: రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించే అవ‌కాశం

చంద్రబాబు నాయుడును కోర్టు (chandrababu naidu) రిమాండ్‌కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు (rajamundry central jail) తరలించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాంతో ఏపీ పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా విజయవాడ – రాజమండ్రి రహదారిని ఆధీనంలోకి తీసుకుని వాహనాలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మీడియాను సైతం కోర్టు పరిసరాల నుంచి దూరంగా పంపిస్తున్నారు.