Babu vs Jagan: ఆ విష‌యంలో వెనుక‌బ‌డిన బాబు.. జ‌గ‌న్‌కు ప్లస్ కాబోతోందా?

Babu vs Jagan: ఈ మ‌ధ్య రాజ‌కీయాలు ఎలా మారాయంటే.. అధికారంలోకి వ‌స్తే ప్ర‌జల‌కు ఏం మంచి చేస్తారో చెప్ప‌కుండా.. తమ గురించి తాము గొప్ప‌గా చెప్పుకునేలా మారాయి. ఓ పేద‌వాడికి ప‌ట్టెడు అన్నం పెట్టి దాని గురించి నెల రోజుల పాటు ప్ర‌చారం చేయించుకునే రోజులివి. ఇలాంటి విష‌యాల్లో పార్టీ ఆరితేరింది. చిన్న మంచి చేసినా దానిని ఇంకెవ్వ‌రూ చేయ‌లేరు అనే రేంజ్‌లో ప‌బ్లిసిటీ చేయించుకుంటుంది. అఫ్‌కోర్స్ ఈ కాలంలో ప‌బ్లిసిటీపైనే అంతా న‌డుస్తోంద‌నుకోండి. అయితే ఈ విష‌యంలో మాత్రం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) వెనుక‌బ‌డ్డార‌నే చెప్పాలి. దాంతో ఈ ప‌బ్లిసిటీ విష‌యం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (Jagan Mohan Reddy) ప్లస్ పాయింట్‌గా మార‌బోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

ఏం జరిగింది?

మ‌డ‌క‌శిర సీటును YSRCP ఈర ల‌క్క‌ప్ప అనే స‌ర్పంచ్‌కి కేటాయించింది. ఈ ల‌క్క‌ప్ప స‌ర్పంచ్ కాక‌ముందు ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా పనిచేసాడు. దాంతో YSRCP ఓ సాధార‌ణ వ్య‌క్తికి సీటు ఇచ్చాం అంటూ తెగ డప్పు కొట్టుకుంటోంది. సందు దొరికితే ఈ విష‌యాన్ని తెగ ప్ర‌చారం చేసుకుంటోంది. మ‌రోప‌క్క తెలుగు దేశం పార్టీ రంప‌చోడ‌వ‌రం సీటును అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త అయిన మిరియాల శిరీషా దేవికి కేటాయించింది. స‌ర్పంచ్ కంటే అంగ‌న్వాడీ ఉద్యోగం చాలా చిన్న‌ది. అలాంట‌ప్పుడు తెలుగు దేశం పార్టీ ఇంకెంత ప‌బ్లిసిటీ చేసుకోవాలి? కానీ పార్టీ అలా ఏమీ చేయ‌లేదు. గూగుల్‌లో ఈర ల‌క్క‌ప్ప గురించి ఉన్న‌న్ని క‌థ‌నాలు శిరీషా దేవి గురించి లేవు అంటే ఏ రేంజ్‌లో YSRCP ప్ర‌చారం చేసుకుంటోందో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

మ‌డ‌క‌శిర‌లో ఈర ల‌క్క‌ప్ప గురించి ఓ రేంజ్‌లో ప్ర‌చారం చేస్తూ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తోంది YSRCP. కానీ చంద్ర‌బాబు నాయుడుకి ఈ టిప్స్ తెలీక ప‌బ్లిసిటీ విష‌యంలో వెనుక‌బ‌డిపోతున్నారు. అది జ‌గ‌న్‌కు ప్ల‌స్ పాయింట్‌గా మారే అవ‌కాశం లేక‌పోలేదు.