Chandrababu Naidu: సాక్షి పేప‌ర్ తెప్పించుకుని చ‌దువుతున్నార‌ట‌

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో త‌న‌కు అనుకూలంగా రాసే పత్రికలతో పాటు, వ్య‌తిరేకంగా రాసే సాక్షి న్యూస్ పేపర్ కచ్చితంగా కావాలని తెప్పించుకొని మరి చదువుతున్నార‌ట‌. బ‌య‌ట జ‌రిగే విష‌యాలు త‌న‌కు ఏవీ తెలీక‌పోవ‌డంతో వార్తా పత్రిక‌ల‌ను తెప్పించుకుని మరీ అన్ని విషయాల‌ను తెలుసుకుంటున్నార‌ట‌. ఈనాడు, ఏబీఎన్ ప‌త్రిక‌లు చంద్ర‌బాబుకి అనుకూలంగా రోజూ వార్త‌లు రాస్తున్నాయి.