Chandrababu Naidu: ఖైదీ నెం.7691

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) అరెస్ట్ అయిన చంద్ర‌బాబుకు (chandrababu naidu) నిన్న విజ‌య‌వాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను ఈ నెల 22 వ‌ర‌కు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌లో ఉంచనున్నారు. జైల్లో చంద్ర‌బాబుకి 7691 నెంబ‌ర్‌ను కేటాయించారు. ఆయ‌న్ను వీలైనంత త్వ‌ర‌గా జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని న్యాయ‌వాదులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈరోజు లంచ్ మోష‌న్ పిటిష‌న్‌ను ప్ర‌వేశ‌పెడ‌తార‌ని తెలుస్తోంది.