Chandrababu Naidu: 20 ప్రశ్నలు.. ఒక్కటే సమాధానం
అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రస్తుతం విజయవాడలోని SIT కార్యాలయంలో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిట్ కార్యాలయంలో అధికారులు సాఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం గురించి దాదాపు 20 ప్రశ్నలు అడిగారు. ఏ ప్రశ్న అడిగినా కూడా పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి అధికారులు ఏ ప్రశ్నలు వేసినా ఆయన కోపంగా నాకేం తెలీదు అని సమాధానాలు చెప్తున్నారని తెలుస్తోంది. అన్నీ విషయాలు కోర్టులోనే తేల్చుకుంటా అని సమాధానం ఇస్తున్నారట. ఇప్పటివరకు సిట్ అధికారులు 20 ప్రశ్నలు అడగ్గా.. వాటికి సమాధానంగా నాకేం తెలీదు.. గుర్తులేదు అని చెప్తున్నారట. (chandrababu naidu arrest)