Chandrababu హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ
చంద్రబాబు నాయుడిని (chandrababu) జైలులో కాకుండా హౌస్ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకునేందుకు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ విషయంలో ఏసీబీ కోర్టు సీఐడి తరఫు న్యాయవాది వాదనలనే పరిగణనలోకి తీసుకున్నారు. మరోపక్క చంద్రబాబు తరఫు అడ్వకేట్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. రేపు ఈ పిటిషన్ను కోర్టు పరిశీలించనుంది. అయితే.. చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. బెయిల్ కాకుండా అసలు కేసే లేకుండా కొట్టివేసేలా పిటిషన్లు వేస్తున్నారు. (chandrababu naidu arrest)