Vijay Sai Reddy: శిక్షా సమయం ఆసన్నమైంది
TDP అధినేత చంద్రబాబు నాయుడికి, మీడియా బ్యారెన్ రామోజీ రావుకి శిక్షా సమయం ఆసన్నమైందని అన్నారు విజయ సాయి రెడ్డి (vijay sai reddy). ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ఎన్నో లెక్కలేనన్ని, క్షమించరాని మోసాలకు పాల్పడ్డారని.. లేట్ అయినా పూర్తి ఆధారాలతో చంద్రబాబుని అరెస్ట్ చేసారని అన్నారు. “” కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చు కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. జీవితాంతం జైల్‌లోనే ఉండాల్సినన్ని నేరాలతో కూడిన స్కాంలు చేశారు చంద్రబాబుఅండ్ కో. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీకి కూడా చట్టం వర్తిస్తుంది. ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైంది “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.