Chandrababu ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు (chandrababu) పెట్టుకున్న 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఫైబర్ గ్రిడ్, అంగళ్ల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో భాగంగా ముందస్తు బెయిల్ పిటిషన్లకు చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ చివరి స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తెలిపింది.