Chandrababu: మరోసారి తీర్పు రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో (skill development scam) జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న TDP అధినేత చంద్రబాబు నాయుడుకు (chandrababu) సంబంధించిన బెయిల్ పిటిషన్లను AP ACB కోర్టు మళ్లీ రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రాలతో (siddharth luthra) పాటు భారత టాప్ న్యాయవాదుల్లో ఒకరైన హరీష్ సాల్వే (harish salve) కూడా ఈ కేసును ఫ్రాన్స్ నుంచే తమ వాదనలు వినిపించారు. వీరిద్దరితో పాటు సిద్ధార్థ్ అగర్వాల్ అనే మరో లాయర్ కూడా వాదించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ACB కోర్టు వాదోపవాదాలు విన్నాక తీర్పును రిజర్వ్ చేసి రేపు వెల్లడించనుంది.
చంద్రబాబు నాయుడిని కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి అన్ని వివరాలు బయటికి వస్తాయని తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలో వినిపించారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా తప్పుడు కేసు పెట్టిందే కాకుండా మళ్లీ కస్టడీ దేనికి అని చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లుత్రా వివరించారు. వాదోపవాదాలు విన్న ACB కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసి రేపు వెల్లడించనుంది.