Chandrababu Naidu: మీ కార్యకర్తలు హ్యాపీగా ఉంటారని దాడులకు పాల్పడవద్దు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, పెట్టిన తప్పుడు కేసులపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు.. తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతలకు ఓ మాట చెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి కొట్టించి బెదిరింపులకు పాల్పడిందని ఇప్పుడు ఎవ్వరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
“” నా జీవితంలో నేను ఇప్పటివరకు కన్నీళ్లు పెట్టింది లేదు. అలాంటిది జగన్ నన్ను తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టించినప్పుడు నా కంట నీరు ఆగలేదు. మనం అందరం మనుషులమే. మనకు ఫీలింగ్స్ ఉంటాయి. అలాగని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. మనకు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా మనం ఏం మాట్లాడుకున్నా ఎవ్వరికీ తెలీదు అనుకోవద్దు. మన మాట తీరు, హావభావాలను ఐదు కోట్ల ప్రజలు చూస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు మనల్ని కష్టపెట్టారు కదా.. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటే కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. అలాంటి చర్యలకు పాల్పడితే ఎవరైనా సరే నేను అస్సలు సహించను “” అని హెచ్చరించారు.