AP Assembly: చంద్ర‌బాబుకు జ‌గ‌న్ రిక్వెస్ట్.. ఒప్పుకున్న సీఎం

chandrababu naidu accepts YSRCP's Request

AP Assembly: ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మ‌వేశం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని ఓ రిక్వెస్ట్ చేసారు. అదేంటంటే.. కేబినెట్ మంత్ర‌ల వాహ‌నాల‌ను అసెంబ్లీలోకి అనుమ‌తించిన‌ట్లుగానే తన వాహనాన్ని కూడా అనుమ‌తించాల‌ని కోరార‌ట‌. తాను ఇత‌ర ఎమ్మెల్యేల‌తో పాటు ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌ని.. మంత్రుల ప్ర‌మాణ స్వీకారం అయ్యాక తాను చేస్తాన‌ని కూడా రిక్వెస్ట్ చేసార‌ట‌. ఇందుకు చంద్ర‌బాబు నాయుడు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.