Chandrababu: అమిత్ షా, నడ్డాలతో భేటీ.. పొత్తు కుదిరినట్లేనా?
Delhi: TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) శనివారం రాత్రి హోం మంత్రి అమిత్ షా (amit shah), BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను (jp nadda) కలుసుకున్నారు. వీరు ముగ్గురూ దేశరాజధాని దిల్లీలో దాదాపు 50 నిమిషాల పాటు చర్చించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. TDP NDA కూటమి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా BJP నేతలను చంద్రబాబు కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దాంతో రానున్న ఎన్నికల్లో (ap elections) కలిసి పోటీ చేసేందుకు పొత్తు కుదుర్చుకోవడానికే చంద్రబాబు వారిని కలిసినట్లు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ap cm jagan) పలుమార్లు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, విభజన సమస్యలు, రాజధాని, పోలవరం లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో పలుమార్లు ఢిల్లీలో భేటీ అయి జగన్ చర్చించారు. కానీ అధికారంలో లేని చంద్రబాబు సడెన్‌గా దిల్లీ వెళ్లి బీజేపీలోని కీలక నేతలను కలవడంతో పెద్ద చర్చకు దారితీసింది.
మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దని బీజేపీతో కలిసి ఉంటామని ప్రకటనలు సైతం చేశారు. అయితే వీరికి మరింత బలం చేకూరాలంటే టీడీపీతో కలిసి రాజకీయ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని దిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏలో చేరకపోయినా వైఎస్ జగన్ కేంద్రం నిర్ణయానికి మద్దతు తెలుపుతుంటారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ ఎన్డీఏ కూటమిలోకి వస్తుందని, టీడీపీకి మాత్రం ఛాన్స్ ఇవ్వవద్దని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కోరినట్లు వాదన సైతం వినిపిస్తోంది. చంద్రబాబు దిల్లీ పర్యటన సక్సెస్ అయితే 2014 కూటమి పదేళ్ల తరువాత మరోసారి ఏపీలో రిపీట్ కానుంది. ఈరోజు చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.