Chandrababu ని విజ‌య‌వాడ త‌ర‌లిస్తున్న పోలీసులు

నంద్యాలలో అర్థ‌రాత్రి TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu) ఏపీ CID పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న్ను విజ‌య‌వాడ త‌ర‌లిస్తున్నారు. చంద్ర‌బాబు సొంత కారులోనే ఆయ‌న్ను విజ‌య‌వాడకు త‌ర‌లిస్తున్నారు. చంద్ర‌బాబుపై ఐపీసీ సెక్ష‌న్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, R/W 109, 34 & 37 కింద కేసులు నమోద‌య్యాయి. ఈ కేసులో చంద్ర‌బాబు ఏ37గా ఉన్నారు. మ‌రోప‌క్క యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్ (nara lokesh) కోన‌సీమ జిల్లాలోని పొడ‌లాడ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిని కూడా క‌లిసే హ‌క్కు త‌న‌కు లేదా అంటూ పోలీసులు ఎదుట బైఠాయించి ధ‌ర్నా చేప‌ట్టారు. (chandrababu)