chandrababu: గుడివాడ సభ ఫ్లాప్.. కారణం ఇదే?
vijayawada: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(chandrababu) మూడు రోజుల కృష్ణా జిల్లా(krishna district) పర్యటన(tour) కొంత వరకు విజయవంతం అయినప్పటికీ.. గుడివాడ(gudivada)లో మాత్రం చప్పగానే సాగిందని చెప్పాలి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రాని(idhem kharma mana rastraniki)కి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పర్యటించిన చంద్రబాబు రోడ్‌షో(road show)కు మాత్రం జనం భారీగా తరలివచ్చారు. ఇక అదే రోజు గుడివాడలో నిర్వహించన సభకు మాత్రం వెయ్యి మందిలోపే జనం కనిపించడం దారుణమైన విషయం. ఎందుకంటే.. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సభకే జనం రాకపోతే.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు ఏవిధంగా పడతాయి అన్నది బలంగా వినిపిస్తోంది. దీనిలో తప్పంతా.. స్థానిక నాయకత్వందేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. కొడాలి అడ్డాగా పిలిచే.. గుడివాడలో చంద్రబాబు పర్యటను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ స్థానిక నాయకులు అలసత్వం చూపారు. దీంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
టీడీపీ అధినేతపై నోరేసుకుని పడిపోయే వైసీపీ నాయకుల్లో ముందు ఉండేది… కొడాలి నాని(mla kodali nani). అలాంటి వ్యక్తి నియోజకవర్గానికి వెళ్తున్నప్పడు స్థానిక నాయకులు జన సమీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. చంద్రబాబు రోడ్‌షోలో మాత్రం జనం కనిపించగా.. ఆ రోజు జరిగిన సభలో మాత్రం ప్రజలు పెద్దగా కనిపించలేదు. చంద్రబాబు వస్తున్నారంటే జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారని టీడీపీ నాయకులు భావించారో ఏమీ కానీ.. అందుకనే ఎవరు జనసమీకరణ చేయలేదు. ఫలితంగా కుర్చీలు ఖాళీ(empty chairs)గా కనిపించాయి. టికెట్టు కోసం గుడివాడలో గొడవలు పడుతున్న నాయకులు.. జనాల్ని తీసుకురావడంపై దృష్టి సారించలేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. చంద్రబాబు ప్రసంగాన్ని టీడీపీ ట్విట్టర్లో 9 నిమిషాల 15 సెకన్ల వీడియో బైట్‌ని అప్ లోడ్ చేశారు. అందులో కనీసం పది సెకన్లు కూడా సభలో ఉన్న జనాలని చూపించలేదంటేనే తెలిసిపోతోంది సభ ఎంత పేలవంగా జరిగిందో.