Chandrababu కారు డ్రైవర్‌ను బెదిరించారా?
శనివారం నంద్యాలలో అర్థరాత్రి హైడ్రామా నడుమ TDP అధినేత చంద్రబాబు నాయుడుని (chandrababu) అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. ఆయన్ను తన కారులోనే భారీ కాన్వాయ్ నడుమ కర్నూలు నుంచి విజయవాడుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ చెప్పినట్లు వినకూడదని చంద్రబాబు తన కారు డ్రైవర్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు రోడ్లపై ఎలాంటి ధర్నా, నిరసనలు లేవని.. కావాలనే చంద్రబాబు కారును నిదానంగా పోనివ్వమని అనడంతో ఈ గ్యాప్‌లో నిరసనలు స్టార్ట్ అయ్యారని డ్రైవర్ డీఐజీకి చెప్పినట్లు సమాచారం. ఇలాంటి నిరసనలు, ధర్నాలు అవుతాయని ముందే తెలిసే.. సీఐడీ అధికారులు కాన్వాయ్‌ను వేగంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేసారు. కానీ చంద్రబాబు వారి మాటలు వినద్దు అని తన కారు డ్రైవర్‌తో చెప్పారట. (chandrababu naidu arrest)