Bharat: మ‌న దేశం ఇండియానా భార‌తా?

మ‌న దేశం పేరేంటి అంటే ఇండియా (india) అని చెప్పుకుంటూ ఉంటాం. భార‌త‌దేశం (bharat) అని ఎప్పుడో కానీ వాడం. కానీ కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం మ‌న దేశాన్ని భార‌త్ అనే పిల‌వాల‌నే కొత్త బిల్లును ప్ర‌తిపాదించే యోచ‌న‌లో ఉంది. త్వ‌ర‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగే జీ20 స‌మ్మిట్‌లో (g20 summit) భాగంగా రాష్ట్ర‌ప‌తిని ఆహ్వానించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాయ‌కుండా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని ఇన్విటేష‌న్ కార్డులో రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ దేశ‌ ప్ర‌భుత్వం కూడా ఇలా ఇన్విటేష‌న్ కార్డుల‌లో రాష్ట్ర‌ప‌తిని ఆహ్వానించ‌డానికి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని సంబోధించ‌లేదు. (bharat)

రాజ్యాంగంలో భార‌త్ అనే ప‌దం ఉంద‌ని, ఆర్టిక‌ల్ 1 ప్ర‌కారం భార‌త్.. రాష్ట్రాల స‌మూహం అని రాసి ఉంటుంద‌ని BJP నేత‌లు స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇక నుంచి రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా అని కాకుండా రిప‌బ్లిక్ ఆఫ్ భారత్ అని సంబోధించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని మ‌న దేశానికి అమృత కాలం మొద‌లైపోయింద‌ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ తెలిపారు. చూడ‌బోతే ఇండియా పేరును ఎక్క‌డా వాడ‌కుండా మ‌న దేశానికి భార‌త్ అని నామ‌క‌ర‌ణం చేస్తారేమోన‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.