Srinivas Varma: ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువే ఇచ్చాం.. NDA నేత ట్విస్ట్
Srinivas Varma: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్‌గా మారారు. చంద్రబాబు నాయుడు చలవతోనే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. అయితే.. చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మాత్రం అడగటం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా అడుగుతారేమో అని అనుకుంటున్నారు. అయితే.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేక హోదా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు మించిన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చామని చెప్తున్నారు. తీర్మానాలు చేసినంత మాత్రాన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలు రావని ఆయన అంటున్నారు. దాంతో ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవాల్సిందే అనే చర్చ వినిపిస్తోంది.