Tomato Rate: దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేసాయ్?
Hyderabad: టొమాటో రేట్లు (tomato rate) ఆకాశానికి తాకుతున్నాయ్. మధ్యతరగతి కుటుంబాలు టొమాటో (tomato) కొనుగోలు చేయలేక అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు టొమాటో రుచి చూడకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. ఇప్పటికే కిలో టొమాటో ధర రూ.300 వరకు చేరింది. అయితే కేంద్రం (bjp) టొమాటో ధరలకు రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ కేవలం నార్త్ ఇండియా ప్రాంతాలైన దిల్లీ, నోయిడా, లక్నౌ, కాన్పూర్, వారణాసి, పట్నా, ముజఫర్‌పూర్, ఆరాలలో మాత్రమే అమలులో ఉంది. ఇందులో ఒక్క దక్షిణాది రాష్ట్రం కానీ నగరం కానీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో (karnataka elections) ప్రజలు BJPని చిత్తుగా ఓడించడంతో కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు కలిగింది. దక్షిణాది రాష్ట్రాలకు ఏ సాయం ప్రకటించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లుంది. ఈ ఎఫెక్ట్ రానున్న అసెంబ్లీ ఎన్నికలపై BJPపై బాగా ఉంటుంది.