Amaravathi: అమరావతికి కేంద్రం బంపర్ ఆఫర్
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అమరావతిలో ఓఆర్ఆర్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. అత్యాధునిక టెక్నాలజీతో 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఇందుకోసం కేంద్రం రూ.25 వేల కోట్లు వెచ్చించనుంది. అమరావతి అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోనుంది.
దీంతో పాటు పలు కీలక ప్రాజెక్ట్‌లకు కూడా ఆమోదం తెలిపింది. అమరావతి నుంచి హైదరాబాద్ మధ్య 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే రాబోతోంది. దీంతో రెండు ప్రాంతాలకు మధ్య 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ముప్పవరం నుంచి అమరావతి మధ్య 90 కిలోమీటర్ల మేర రహదారి రాబోతోంది. రాయలసీమ నుంచి కూడా అనుసంధానం పెరగనుంది. దీంతో పాటు బెజవాడ తూర్పు బైపాస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారు.