Manipur Violence: కేసును CBIకి అప్పగించిన కేంద్రం
Manipur: గత మూడు నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్ (manipur violence) కేసును కేంద్ర ప్రభుత్వం CBIకి అప్పగించేసింది. మణిపూర్ అంశాన్ని పట్టించుకోవడానికి ఇంకెంత టైం కావాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగిన ప్రశ్నకు కేంద్రం చెప్పిన సమాధానం ఇది. దీనిని CBIకి అప్పగించాం అని తెలిపింది. ఇటీవల ఇద్దరు కుకీ జాతికి చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించి దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటంతో సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే తామే ఇన్‌వాల్వ్ అవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. దాంతో కేంద్రం ఆ ఇద్దరు మహిళల దర్యాప్తు కేసును CBIకి అప్పగించింది. మణిపూర్ ప్రభుత్వంతో చర్చించాకే కేసును CBIకి అప్పగించాలని నిర్ణియించుకున్నట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.