Viveka Case: పీఏ కంటే ముందే జగన్‌కు తెలుసన్న CBI
Hyderabad: దివంగత నేత వైఎస్ వివేకా (viveka case) చనిపోయిన సంగతి ఏపీ సీఎం జగన్‌కు (cm jagan) ముందే తెలిసిందని CBI కీలక విషయం ప్రస్తావించింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వివేకా (viveka case) చనిపోయిన సంగతి పీఏ కృష్ణా రెడ్డి (krishna reddy) కంటే ముందే జగన్‌కు తెలుసని, ఆయన చనిపోయిన రోజు జగనే మీడియా ద్వారా తెలియజేసారని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. వివేకా చనిపోయిన సంగతి పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే జగన్‌కు తెలిసింది. ఆయనకు ఎలా తెలిసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంది. మరో పక్క ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, లొంగిపోవాలని చెప్పినా వినడంలేదని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి రాత్రి 12:27 నుంచి 1:10 వరకు కాల్స్ మాట్లాడారని, హత్య విషయంలో అవినాష్‌కి తెలిసిన వివరాలు బయటపెట్టడానికి ముందుకు రావడంలేదని అఫిడవిట్‌లో పేర్కొంది.
మరోపక్క అవినాష్‌కు ముందస్తు బెయిల్ విషయాన్ని కూడా సీబీఐ హైకోర్టును ఓ రిక్వెస్ట్ చేసింది. జూన్ 30లోగా వివేకా కేసును పూర్తిచేసేయాలని, టైం లేనందున అవినాష్‌కు బెయిల్ ఇవ్వకూడదని పేర్కొంది. ఆయన ఎంత త్వరగా సహకరిస్తే అంత త్వరగా కేసు పూర్తవుతుందని తెలిపింది. కానీ అవినాష్ రెడ్డి తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ విచారణకు హాజరుకాలేకపోతున్నారని, ఆయన్ను కస్టోడియన్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.