Viveka Case: 8వ నిందితుడిగా అవినాష్ రెడ్డి

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (viveka case) రెడ్డి హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని (avinash reddy) 8వ నిందితుడిగా CBI త‌న చార్జ్ షీట్‌లో పేర్కొంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డి (bhasker reddy) పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌పై సీబీఐ కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. భాస్క‌ర్ రెడ్డి బెయిల్ విష‌య‌మై సీబీఐ కోర్టు శుక్ర‌వారం తీర్పు వెలువ‌రించ‌నుంది. గ‌తంలో అవినాష్ రెడ్డిని స‌హ నిందితుడిగా పేర్కొన్న CBI ఇప్పుడు ఎనిమిద నిందితుడిగా చేర్చింది. భాస్క‌ర్ రెడ్డిని విడుద‌ల చేస్తే సాక్ష్యుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తార‌ని, మ‌ళ్లీ విచార‌ణ జ‌ర‌ప‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని సీబీఐ కోర్టుకి తెలిపింది.