Viveka case: ఏ క్షణమైనా అవినాష్ అరెస్ట్!
Kurnool: వివేకా హత్య కేసు(viveka case) విచారణలో భాగంగా ప్రధాన అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని(avinash reddy) సీబీఐ(cbi) ఏ క్షణమైనా అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఐదు సార్లు విచారణకు హాజరుకావాల్సిన సీబీఐ అవినాష్‌కు నోటీసులు పంపింది. కానీ ఏదో ఒక సాకుతో విచారణకు హాజరుకాకుండా ఎస్కేప్ అవుతున్నాడు. మొన్న 20న విచారణకు రావాలని నోటీసులు పంపితే.. తన తల్లికి గుండెపోటు వచ్చిందని రాలేనని చెప్పి కర్నూల్ (kurnool)వెళ్లిపోయారు. సరేనని ఈరోజు రావాల్సిందిగా మళ్లీ నోటీసులు పంపారు. ఈరోజు కూడా అవినాష్(avinash) విచారణకు డుమ్మా కొట్టేలా ఉన్నాడని సీబీఐ కర్నూల్ బయలుదేరింది. అవినాష్ రెడ్డి తల్లి కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌లో ఉన్నారని, అవినాష్ కూడా అక్కడే ఉన్నారని తెలిసి సీబీఐ అక్కడికి చేరుకుంది. మరోవైపు పోలీసులు భారీగా బందోబస్తు పెట్టారు. హాస్పిటల్ దగ్గర్లోని షాపులన్నీ మూసివేయించారు. మరి అవినాష్‌ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి(viveka murder case).
సీబీఐ అధికారులను హాస్పిటల్ లోపలికి పోనివ్వకుండా వైసీపీ(ycp) కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దాంతో తాము గొడవపడటానికి రాలేదని, లొంగిపోవాలని అవినాష్‌కి మీరే వెళ్లి చెప్పండి అని సీబీఐ(cbi) అధికారులు చెప్పారు. ఇందుకు కర్నూల్ ఎస్పీ(kurnool sp) సాయం తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఎస్పీ ఆలోచిస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న పలువురు మీడియా ప్రతినిధులపై వైసీపీ(ycp) కార్యకర్తలు దౌర్జన్యం చేసారు. రాత్రిపూట ఇక్కడేం పని అంటూ కెమెరాలు, మైకులు పగలగొట్టారు. వారిని నోటికొచ్చిన బూతులు తిట్టారు.