Viveka Murder Case: స్పీడ్ పెంచిన సీబీఐ.. విచారణకు ఎంపీ అనుచరుడు
kadapa: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(vivekananda reddy murder case) విచారణలో సీబీఐ(cbi) దూకుడు పెంచింది. ఇప్పటికే కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఈ నెలలోపు హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు(suprem court) ఇటీవల సీబీఐ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారుల స్పీడ్ పెంచారు. తాజాగా… ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డి(mp avinash reddy) ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి(udhay kumar reddy), అతడి తండ్రి జయప్రకాశ్‌రెడ్డి(jaya prakash reddy)ని సీబీఐ విచారిస్తోంది. గూగుల్ టేక్‌అవుట్(google take out) ఆధారంగా అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి(bhaskar reddy) ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. పులివెందుల(pulivendhula) నుంచి కడప కారాగారం అతిథిగృహానికి ఉదయ్‌ను తీసుకెళ్లిన అధికారులు అక్కడ విచారణ ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు.. ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్లు ఆరోపణలున్నాయి. ఉదయ్‌ను గతంలో పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఇక మరోసారి విచారణకు పిలవడంతో.. మరికొన్ని ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.