విచారణకు అవినాష్‌, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌… CBI ప్రశ్నలు ఇవే!

Hyderabad: వైఎస్‌ వివేకా హత్య కేసు(ys viveka murder case) కు సంబంధించిన విచారణలో భాగంగా.. ఇవాళ సీబీఐ(cbi) విచారణకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) వెళ్లారు. ఆయనతోపాటు.. చంచల్‌గూడలో ఉన్న భాస్కర్‌రెడ్డి(ys bhaskar reddy), ఉదయ్‌కుమార్‌ రెడ్డి(uday kumar reddy)ని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. అయితే ముగ్గురినీ కలిపి ప్రశ్నిస్తారా లేదా వేర్వేరుగా ప్రశ్నిస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయిదోసారి విచారణకు వెళ్లారు. ఇక ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియోతో సహా సీబీఐ రికార్డ్ చేయనుంది.

ఇవాళ సీబీఐ విచారణకు వెళ్తున్న భాస్కర్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయనకు కొద్దిగా బీపీ పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం మందులు వేసుకుని విచారణకు వెళ్లినట్లు సమాచారం. ఇక.. వివేకా హత్య కేసులో ఏ-6, ఏ-7గా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఉన్నారు. వీరు ఈ నెల 24 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. సుప్రీం కోర్టు గడువు సమీపిస్తున్న తరుణంలో కేసును వేగవంతంగా పూర్తి చేసి.. షార్జిషీట్‌ ఫైల్‌ చేయాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈనేపత్యంలో అసలు వివేకా హత్య జరిగిన రోజు, అంతకు ముందు రోజు.. ఏం జరిగింది అన్నదానిపై అధికారులు ఈ ముగ్గురినీ విచారించనున్నారు. నిందితులు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారు..? ఏ పని మీద అక్కడికి వచ్చారు అన్నదానిపై కూడా ప్రశ్నించనున్నారు. ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే.. హత్య జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి ప్రయత్నించారని సీబీఐ బలంగా నమ్ముతుంది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది. గొడ్డలి పోటును గుండె పోటుకు మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పారు.. అన్నవాటిపై సీబీఐ అవినాష్‌ను ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉంది.