Janasena: ఎన్నికల ముందు జనసేనకు షాక్.. !
Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (ap elections) దగ్గరపడుతున్నాయి. త్వరలో ఎన్నికల సంఘం (election commission of india) నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. మరోపక్క జనసేనతో పొత్తులో ఉన్న తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) ఇతర నేతలు అటు ప్రచారాలతో ఇటు ఓదార్పు యాత్రలతో బిజీగా ఉన్నారు.
మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఇంకా వారాహి యాత్రను ప్రారంభించలేదు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలేదన్న టెన్షన్ జనసైనికులు, నేతల్లో క్లియర్‌గా తెలుస్తోంది. ఈ సంగతి పక్కనపెడితే ఇప్పుడు జనసేనకు ఎన్నికల ముందు గట్టి షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి టీ గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే.
అయితే అప్పటికే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (Rashtriya Praja Congress Party) అనే కొత్త పార్టీ కూడా టీ గ్లాస్ గుర్తునే తమ పార్టీ గుర్తుగా పెట్టుకుంది. అయితే ఎన్నికల కమిషన్ టీ గ్లాస్ గుర్తును కేటాయించడానికి ముందే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనతో చర్చలు జరపాలనుకున్నారు. చర్చలు పూర్తి కాకుండానే టీ గ్లాసును ప్రకటించేసారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు హైకోర్టు తెలపడం షాకింగ్‌గా మారింది. ఈ అంశంపై త్వరలో విచారణ జరిపి వాదోపవాదాలు వినిపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనసేన పార్టీకి టీ గ్లాస్ గుర్తు ఇవ్వడం ఎన్నికల పోల్ కోడ్‌ను ఉల్లంఘించినట్లే అని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. 2023 మే 13న కేంద్ర ఎన్నికల కమిషన్ టీ గ్లాస్‌ను ఉచిత ఎన్నికల సింబల్‌గా ప్రకటించిందని.. అలా ప్రకటిస్తే ఆ సింబల్‌ను ఎవరైనా వాడుకోవచ్చని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే జనసేనకు ఆ పార్టీ గుర్తు తెలంగాణలో చెల్లుతుంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో కాదని.. తమ పార్టీ తరఫు గుర్తు కూడా అదే కాబట్టి ముందు చర్చలు జరిపి అవి ఓ కొలిక్కి వచ్చాక ప్రకటించాలి కానీ ముందే ఎలా ప్రకటించేస్తారని ప్రశ్నించారు.
ఈ విషయంపై జనసేన నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ గుర్తును మార్చుకోవడానికి ఒప్పుకోవడంలేదు. మరోవైపు జనసేన నేతలు దీనిపై ఇంకా స్పందించలేదు. అయినా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ గుర్తును ఎంచుకునే ముందు బాగా ఆలోచించాల్సింది. ఆల్రెడీ తెలంగాణలో టీ గ్లాస్ గుర్తుతో జనసేన పోటీ చేస్తున్నప్పుడు ఏపీలో మాత్రం వేరే గుర్తుతో ఎలా పోటీ చేస్తారని అనుకున్నారు? ఈ లాజిక్ మిస్సయిపోయి ఇప్పుడు తమ గుర్తును జనసేనకు కేటాయించారు అంటే ఎలా కుదురుతుంది?
ఇదేదో కావాలని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ కావాలని ఎన్నికల ముందు జనసేనతో గొడవ పెట్టుకుని తమని తాము కాస్త హైలైట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఉంది. లేకపోతే ఎన్నికల కమిషన్ టీ గ్లాస్ గుర్తు జనసేనదే అని ప్రకటించినప్పుడు ఎందుకు కేసు కానీ పిటిషన్ కానీ వేయలేదు? సరిగ్గా ఇంకొన్ని రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై నోటిఫికేషన్ వస్తుంది అన్న సమయంలో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడం ఎంత వరకు కరెక్టో వారే ఆలోచించుకోవాలి.
మరోపక్క ఎన్నికల కమిషన్ వేరే గుర్తును తీసుకోండి అని చెప్పినా కూడా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే టీ గ్లాస్ గుర్తును తమ పార్టీ గుర్తుగా నిర్ణయించుకున్నామని ఇప్పుడు ఆ గుర్తును జనసేన ఎగరేసుకుపోతామంటే ఎలా ఊరుకుంటామని అంటున్నారు.