India Canada Row: అబద్ధాలు వద్దు.. కెనడాపై భారత్ ఆగ్రహం
కెనడాపై భారత్ (india canada row) మండిపడింది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (hardeep singh nijjar) హత్య కేసులో ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు భారత్‌పై ఆరోపణలు చేస్తున్న కెనడా ఇప్పుడు మరో వివాదానికి తెరలేపింది. ఇండియాలో కెనడా దౌత్యాధికారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొందరిని విత్‌డ్రా చేసుకుని వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం అల్టిమేటం విధించింది. ఈ నేపథ్యంలో కెనడా ఇప్పటివరకు 41 మంది తమ దౌత్యాధికారులను వెనక్కి పిలిపించుకుంది. అయితే దీని వెనుక కారణాన్ని వెల్లడిస్తూ భారత్‌ను నిందించాలని చూసింది.
భారత్‌లో దౌత్యాధికారుల రక్షణకు సంబంధించిన నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని అందుకే వారిని వెనక్కి రప్పించాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. అందులో ఏమాత్రం నిజంలేదని.. కెనడా అబద్ధాలు ఆడటం సరికాదని మండిపడింది. ఇండియా, కెనడా దేశాల్లో ఇరు దేశాలకు సంబంధించిన దౌత్యాధికారుల సంఖ్య సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సంఖ్యను తగ్గించాలని కెనడాను కోరినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.