EXCLUSIVE: “చంద్రబాబు కేసును లోకేషే వాదిస్తానని అన్నాడు”
EXCLUSIVE: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయినప్పుడు ఏ లాయర్ వాదించినా దాదాపు నెల రోజుల పాటు బెయిల్ రాకపోవడంతో నారా లోకేషే (nara lokesh) తన తండ్రి కేసును వాదించాలని అనుకున్నాడని సెటైర్ వేసారు నందికొట్కూర్ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (byreddy siddharth reddy). ఇదే విషయాన్ని లోకేష్ చంద్రబాబుతో చెప్తే.. ఏ పనికిమాలిన లాయర్ వాదించినా తనకు బెయిల్ వస్తుంది కానీ నువ్వు వాదిస్తే జీవితంలో బెయిల్ రాదు అని చెప్పారంటూ విమర్శలు గుప్పించారు.
అందుకే పవన్‌కు జగన్ అంటే కోపం
జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) పవన్ (pawan kalyan) కంటే వయసులో మూడేళ్లు చిన్నవాడని.. అంతటి చిన్నవాడు రాష్ట్రాన్ని పాలిస్తుంటే తాను మాత్రం కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయానన్న అసూయతో జగన్‌ను తిడుతున్నాడని సిద్ధార్థ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసినందుకే
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసిన పార్టీ YSRCP అని అందుకే వైఎస్ షర్మిళ ద్వారా మళ్లీ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవాలని వారు జగన్‌పై నోరుపారేసుకుంటున్నారని తెలిపారు.
ఎక్కడ దేశాన్ని ఏలుతాడోనని..
ఇక భారతీయ జనతా పార్టీ కూడా జగన్‌ను నోటికొచ్చినట్లు తిడుతోందని… దేశంలోనే పవర్ఫుల్ సీఎం జగన్ కాబట్టి రేపో మాపో జాతీయ స్థాయిలో పాలించేస్తాడేమోనన్న భయంతో BJP జగన్‌పై నోరుపారేసుకుంటోందని సిద్ధార్థ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.