Buddha Venkanna: రచ్చ షురూ.. లోకేష్‌కి ఎంపీ సీటు వద్దంటున్న వెంకన్న
Buddha Venkanna: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచేస్తుందని బలంగా ఫిక్స్ అయిపోయారు కూటమి పెద్దలు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు రచ్చ రాజుకునేలా చేసాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే.. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వద్దని.. ఆ మంత్రి పదవి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన అచ్చెన్నాయుడుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్‌కు మంత్రి పదవి కాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని అంటున్నారు. దీనిపై అచ్చెన్నాయుడు కానీ తెలుగు దేశం పార్టీ కేడర్ కానీ స్పందించాల్సి ఉంది.