Btech Ravi: చంపాలనుకుంటే నన్ను చంపేయ్ జగన్..!
Btech Ravi: TDP నేత బీటెక్ రవి జైలు నుంచి విడుదలయ్యాక తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. తనను చంపడానికి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అరెస్ట్ చేయించాడని.. ఆయన కనుసన్నల్లోనే అధికారులు కూడా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్న పోలీసులను తాము వదిలిపెట్టబోమని.. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే కొందరు పోలీసులపై వ్యక్తిగతమైన చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు.
తనను జగన్ చంపాలనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి తాను అనాథను కానని.. తన తమ్ముళ్లు, బాబాయ్, కొడుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్‌కు ఏమన్నా జరిగే కాపాడటానికి ఎవరున్నారని ప్రశ్నించారు. తనను చంపాలనుకుంటే కిరాయి రౌడీలకు రూ.10 కోట్లు ఇస్తే వారే చంపేస్తారని.. అలా కాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని కిడ్నాప్‌లు చేయించాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం స్థాయిలో ఉండి ఇలా చేయడం సిగ్గుచేటని అన్నారు.