BTech Ravi: నాకేమన్నా జరిగితే జగన్, భారతినే కారణం
BTech Ravi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తనకు ఉన్న సెక్యూరిటీని జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) తీసేసారని ఆరోపిస్తున్నారు బీటెక్ రవి. ఎన్నికలకు ముందు తనకు సెక్యూరిటీ తీసేసారంటే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని క్లియర్గా తెలుస్తోంది. ప్రస్తుతం తనపై తప్పుడు కేసు పెట్టారు కాబట్టి ప్రతి వారం వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుందని.. తాను బయటికి వెళ్లేటప్పుడు భద్రతా బలగాలు ఉంటే చంపలేం అని తెలిసే భద్రతను తొలగించారని అన్నారు. ఎన్నికల సమయం కాబట్టి గ్రామ గ్రామాలకు తిరుగుతానని.. ఈ నేపథ్యంలో తనకు ఏదన్నా జరిగితే అందుకు జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డే కారణమని వెల్లడించారు.