Telangana Elections: ఆ నాలుగు సీట్ల సంగతి ఏమాయె?
Telangana Elections: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో BRS పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేసింది. కానీ నాలుగు సీట్ల విషయంలో మాత్రం BRS పార్టీ ఎటూ తేల్చలేకపోతోంది. ఇంతకీ అవి ఏ సీట్లో ఎందుకు ఇంకా అభ్యర్ధులను నిర్ణయించలేదో ఓ లుక్కేద్దాం.
జనగామ (jangaon)
జనగామ నియోజకవర్గంలో ప్రస్తుతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (muthireddy yadagiri reddy) ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎక్కడ హంగ్ (సంకీర్ణం) ఏర్పడుతుందోనన్న భయంతో పార్టీ ముత్తిరెడ్డి స్థానంలో వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన్ను TSRTC ఛైర్మన్‌గా విరమించి బుజ్జగించాలని చూసింది. ఆయన స్థానంలో జనగామలో పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని (palla rajeshwar reddy) బరిలోకి దించాలని యోచిస్తోంది.
ఈ నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ (congress) కూడా అభ్యర్ధిని ప్రకటించలేదు. ఎవరు ముందు ప్రకటిస్తారో చూసి వారికి తగ్గట్టు అభ్యర్ధిని దించాలని రెండు పార్టీలు యత్నిస్తున్నాయి. ఇక ఈరోజు కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనుంది. అందులో జనగామ నుంచి ఎవరు పోటీకి దిగనున్నారో తెలిసే అవకాశం ఉంది. ఇక BJP నుంచి జనగామలో ఆరుట్ల దశమంత్ రెడ్డి (arutla dashmanth reddy) పోటీ చేయనున్నారు. (telangana elections)
నాంపల్లి (nampally)
నాంపల్లి నియోజకవర్గంలో కూడా BRS ఇప్పటివరకు అభ్యర్ధిని ప్రకటించలేదు.ఇక్కడ AIMIM ఎవర్ని బరిలోకి దింపనుందో BRS వేచి చూస్తోంది. ప్రస్తుతానికి AIMIM నుంచి నాంపల్లికి జాఫర్ హుస్సేన్ మిరాజ్ (jaffer hussain meraj) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను వేరొకరితో రీప్లేస్ చేయాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ తరఫున నాంపల్లి నుంచి ఫెరోజ్ ఖాన్ (feroz khan) పోటీ చేయనున్నారు.
గత ఎన్నికల్లో ఫెరోజ్ ఖాన్ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు అక్కడి ప్రజల మూడ్‌ని బట్టి ఫెరోజ్ ఉంటేనే బాగుంటుందని కాంగ్రెస్ నిర్ణయించింది. ఒకవేళ AIMIM ఎంపికచేసే అభ్యర్ధికి గెలిచేంత బలం లేకపోతే అప్పుడు BRS స్ట్రాంగ్ అభ్యర్ధిని ఎంచుకోనుంది. నాంపల్లిలో BJP కూడా ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. (telangana elections)
గోషామహల్ (goshamahal)
గోషామహల్లో ఎప్పటినుంచో గెలుస్తూ వస్తున్న సస్పెండ్ అయిన రాజా సింగ్నే (raja singh) bJP ఈసారి కూడా ఎంపికచేస్తుందని BRSకు ముందే తెలుసు. అందుకే వారు ప్రకటించే వరకు BRS వేచి చూసింది. కాబట్టి ఇప్పుడు రాజా సింగ్‌పై పోటీ చేయడానికి BRS నంద కిశోర్ వ్యాస్‌ను (nanda kishor vyas) ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి గోషామహల్లో మొగిలి సునీత (mogili sunitha) బరిలోకి దిగనున్నారు.
నర్సాపూర్ (narsapur)
ప్రస్తుతానికి నర్సాపూర్‌లో ఎమ్మెల్యేగా BRS నేత మదన్ రెడ్డి (madan reddy) ఉన్నారు. ఇప్పుడు అతన్ని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డికి (sunitha laxma reddy) అవకాశం ఇచ్చింది. మహిళలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే సునీతకు అవకాశం ఇచ్చినట్లు BRS తెలిపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించలేదు. BJP నుంచి ఎర్రగొల్ల మురళీ యాదవ్ (erragolla murali yadav) పోటీ చేయనున్నారు. త్వరలో ఈ నాలుగు సీట్ల నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అనేది వెల్లడిస్తామని మంత్రి హరీష్ రావు (harish rao) తెలిపారు. (telangana elections)