KTR: ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌లేన‌న్న KTR

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. అయితే సిరిసిల్ల నుంచి గెలిచిన KTR మాత్రం ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రుకాలేక‌పోయారు. BRS అధినేత KCRకి సర్జరీ జ‌రిగిన‌ నేపథ్యంలో మరొక రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాన‌ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని KTR కోరారు. KCR వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన BRSLP సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. KCR ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరో రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు KTR తెలిపారు.