BRS: ఎవరికి ద‌క్కేనో..!

రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) BRS పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధుల జాబితాను తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR ఈరోజు విడుద‌ల చేయ‌నున్నారు. ఈసారి మాత్రం ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌న్నా కూడా వారి పెర్ఫామెన్స్‌ని బ‌ట్టే ఇవ్వాల‌ని KCR నిర్ణ‌యించుకున్నార‌ట‌. పార్టీ కోసం విశ్వాసంగా ప‌నిచేసేవారికే టికెట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ చేయించిన స‌ర్వే ఆధారంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్ కోసం వేచి చూస్తున్న‌వారి ప‌ర్స‌న‌ల్ బ్యాక్‌గ్రౌండ్.. సీనియ‌ర్ లీడ‌ర్ల ప‌ర్స‌న‌ల్ ఎజెండాల‌ను KCR పరిశీలిస్తున్న‌ట్లు గ్రౌండ్ రిపోర్టులు చెప్తున్నాయి. త‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రి పేర్ల‌ను సిఫార‌సు చేసినా వారి గురించి కూడా పూర్తిగా కనుక్కున్నాకే టికెట్ ఇవ్వాలో లేదో నిర్ణ‌యిస్తారు.

“మ‌హా” సంక్షోభం జ‌ర‌గ‌కుండా

2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో KCR ఒకేసారి 105 స‌భ్యుల జాబితాను విడుద‌ల చేసారు. ఈసారి మొద‌టి జాబితాలో 87 స‌భ్యుల పేర్లు మాత్రమే ఉండ‌బోతున్నాయి. రెండో ద‌ఫాను ఈ నెల 25న విడుద‌ల చేస్తారు. TRSను BRSగా మార్చిన త‌ర్వాత జ‌ర‌గబోయే మొద‌టి ఎన్నిక‌లు ఇవి. అందుకే KCR చాలా ప్లానింగ్ చేస్తున్నారు. BJP మ‌హారాష్ట్ర‌లో రెండు పార్టీల‌ను (NCP, shivsena) చీల్చింది. ఆ చీలిక తెలంగాణ‌లో మాత్రం అస్స‌లు ఉండ‌కూడ‌దు అని KCR బ‌లంగా నిర్ణ‌యించుకున్నారు.