Lok Sabha Elections: గులాబి వ్యూహం
Lok Sabha Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది BRS పార్టీ. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని తెగ వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎంపీలను మార్చాలని గులాబీ బాస్ KCR అనుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సిట్టింగులను మార్చకపోవడం వల్లే ఓడిపోయాం అని రియలైజ్ అయిన KCR లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయాలనుకోవడంలేదు. KCR సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో తరఫున 9 మంది BRS ఎంపీలు లోక్ సభ ఎన్నికల్ల పోటీ చేసే అవకాశం ఉంది.
మరోపక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ (congress) కూడా 17 స్థానాలకు గానూ 10 స్థానాల్లో ఆల్మోస్ట్ అభ్యర్ధులను ఖరారు చేసుకుంది. ఇక తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయిన BJP లోక్ సభ ఎన్నికల్లో అయినా దాదాపు పది స్థానాలు దక్కించుకోవాలని ప్లాన్ వేస్తోంది. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ BJP ఎంపీలపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు (amit shah) ఆదేశాలు జారీ చేసారు.
BRS లోక్ సభ అభ్యర్ధులు
నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
మెదక్ – KCR
మల్కాజ్‌గిరి – సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
సికింద్రాబాద్ – తలసాని సాయి కిరణ్
చేవెళ్ల – రంజిత్ రెడ్డి
మహబూబ్ నగర్ – శ్రీనివాస్ గౌడ్
నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు
నల్గొండ – గుత్తా అమిత్ రెడ్డి
భువనగిరి – బాలరాజు యాదవ్
వరంగల్ – టి రాజయ్య, పసునూరి దయాకర్
మహబూబాబాద్ – రెడ్యా నాయక్, మాలోత్ కవిత
ఖమ్మం – నామా నాగేశ్వరరావు