BRS: కాంగ్రెస్‌, బీజేపీని ఎదుర్కొనేందుకు KCR నయా ప్లాన్‌!

Hyderabad: తెలంగాణలో KCR సర్కార్‌ (brs) రానున్న ఎన్నికలలో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారు. ఒకటి కాంగ్రెస్‌, రెండోది BJP. తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. అక్కడ నాయకత్వానికి ఎలాంటి లోటు లేదు. బలమైన కేడర్‌ ఉంది. ఇక ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ (congres) విజయం సాధించడంతో తెలంగాణలో ఆ పార్టీ మంచి ఊపుమీద ఉంది. కార్యకర్తలు, నాయకుల్తో కూడా జోష్‌ నిండింది. బీజేపీకి మాత్రం కేడర్‌ లేకపోవడం ప్రధాన సమస్య. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా బలపడలేదు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా.. తెలంగాణలో పేరున్న నాయకులు ఉన్నప్పటికీ.. బీజేపీ జనాల్లోకి వెళ్లలేకపోతోంది. దీనికి కారణం ఇక్కడి ప్రజలు మతం కంటే.. తెలంగాణ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీన్నే ఆయుధంగా చేసుకుని రెండు దఫాలు కేసీఆర్‌ సీఎం అయ్యారు. ఇక మూడో సారి కూడా సీఎం కుర్చీపై కన్నేసిన ఆయన.. రానున్న ఎన్నికలకు పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు.

కేసీఆర్‌ రాజకీయ చాణిక్యుడు అనే పేరు ఉంది. అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తొలిసారి.. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బకొట్టారు. ముఖ్యమైన నేతలకు పదవులు ఎరచూపి BRS లో చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ లీడర్‌షిప్‌ బలహీన పడింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను క్షేత్ర స్థాయిలో లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో బీజేపీని పరోక్షంగా ఆయన ప్రోత్సహించారనే వాదన కూడా ఉంది. ఎందుకంటే… బలమైన ప్రత్యర్థి కంటే.. బలహీన ప్రత్యర్థి ఉంటే.. రాజ్యాధికారం సులువు అని గ్రహించిన కేసీఆర్‌.. పక్కా ప్లాన్‌తోనే ఏదైనా చేస్తారనే పేరు ఉంది. ఇక రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తెలంగాణ సెంటిమెంట్‌తోనే ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ది గురించి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలు, క్షేత్ర స్థాయి నాయకులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.