Peddi Sudarshan Reddy: తల్లికి, భార్యకి తేడా తెలీనట్లుంది
Hyderabad: TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (revanth reddy) BRS ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (peddi sudarshan reddy) మండిపడ్డారు. నిన్న రేవంత్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ” రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడింది“ అని అన్నారు. దాంతో రాజీవ్ గాంధీ తల్లిని పట్టుకుని భార్య అనడానికి సిగ్గులేదా అంటూ సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ” TPCC అధ్యక్షుడై ఉండి ఇందిరా గాంధీ గురించి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. తల్లుల ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా ఉన్నాయి బ్రోకర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వెంటనే రేవంత్ తల్లులందరికి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేసారు.