Malla Reddy: ఈ వ‌య‌సులో చంద్రబాబు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌టం గ్రేట్

brs malla reddy praises chandrababu naidu

Malla Reddy: విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరు అద్భుతం అని కొనియాడారు భార‌త రాష్ట్ర స‌మితి నేత మ‌ల్లా రెడ్డి. ఈరోజు త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. కాలి న‌డ‌క‌న కొండెక్కి శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తాయ‌ని.. విజ‌య‌వాడలో చంద్ర‌బాబు ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఎంతో శ్ర‌మించి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడారంటే నిజాంగా చాలా గ్రేట్ అని అన్నారు. కేటీఆర్, కేసీఆర్‌లు తెలంగాణ‌ను ఎంతో అభివృద్ధి చేసార‌ని.. ముందు ముందు కూడా ఇంకా బాగా చేస్తార‌ని అన్నారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌డం లేదని.. అలాంటిదేమైనా ఉంటే తానే స్వ‌యంగా చెప్తాన‌ని వెల్ల‌డించారు.