BRS: కాంగ్రెస్ మంత్రులు బూతుల క్లాసులు తీసుకుంటున్నారా?

BRS: కాంగ్రెస్ (Congress) మంత్రులు మూర్ఖులుగా మారిపోయారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు BRS నేతలు ఈడిగ ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ మంత్రులు చాలా దుర్మార్గంగా అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు మూర్ఖులుగా మారిపోయారు.

రాష్ట్రానికో.. పాలమూరుకో.. ఏం చేస్తామనేది చెప్పకుండా ఇష్టా రీతిగా మాట్లాడుతున్నారు. రోజు సునిల్ కనుగోలు బూతులు ఎట్లా మాట్లాడాలా అని మంత్రులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారా..? KCRను తిట్టకుంటే మంత్రులుగా మిమ్మల్ని ప్రజలు గుర్తించడం లేదనుకుంటున్నారా? మంత్రి కోమటి రెడ్డి (Komatireddy Venkat Reddy) కోట్లు వేసుకుని వికృతంగా మట్లాడితే మీకు గౌరవం రాదు. కోమటి రెడ్డి కోతలరెడ్డి.. కారు కూతలరెడ్డి. కోమటిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకో…ఇలాగే బూతులు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. కేసీఆర్ మీద మంత్రులు మాట్లాడితే గొప్పవారు అవుతార‌నుకుంటున్నారు. KCR కంటే గొప్పలపాలన చేసి మంచి పేరు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వెయ్యి జన్మలెత్తిన KCR త్యాగాల‌ ముందు మీరు ఏపాటి? (BRS)

ALSO READ: Singireddy Niranjan Reddy: ఆంధ్రా నేతలు చాకచక్యంగా ప్రచారం చేస్తున్నారు

కాంగ్రెస్ నేతలు ఇంతకాలం రాజకీయ బేతాళులుగా ఉన్నారు. కాలం కలిసొచ్చి గాలికి మంత్రి పదవులు రావడంతో తట్టుకోలేక పోతున్నారు. కోమటిరెడ్డితో సహా కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల ముందు జోకర్లుగా మిగిలిపోయాడం ఖాయం. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటేనే ఒంటిపై చీమలు పాకినట్టు ప్రవర్తించారు కోమటిరెడ్డి.ఇప్పుడు రేవంత్ రెడ్డి భజన చేస్తున్నాడు. గతంలో ఏం మాట్లాడిండో మర్చిపోయినట్టున్నాడు. మాణిక్యం ఠాగూర్ దగ్గర 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని రేవంత్ రెడ్డిని ఆరోపించావు. ఇప్పుడు పదవుల కోసం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాళ్ళ దగ్గర చేరాడు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి సోదరులకు పార్టీ మీద గౌరవం ఉండదు.. సొంత పార్టీ మీద అసలు గౌరవం ఉండదు.

గతంలో మునుగోడు ఎన్నిక‌ల్లో రాజగోపాల్ రెడ్డి కోసం కోమటిరెడ్డి ప్రచారం చేసాడు. మాణిక్యం ఠాగూర్ మా నాయకుల మీద కేసులు పెడతాడు.. లీగల్ నోటీసులు ఇస్తాడు. మరి ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి పై ఎందుకు కేసులు పెట్టడు? మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) కేసులు పెట్టకుండా కోమటిరెడ్డి అత‌ని కాళ్ళు మొక్కాడు. రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి మంచి సలహాలు ఇవ్వండి.. మంచి పాలన చేయండి. పదేళ్ల కేసీఆర్ పాలనలో పోస్టుమార్టం చేసుకుంటా పోతే వచ్చేది ఏం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ల‌లో ఓసీలకు పోస్టులు పెంచారు.. బీసీలకు అన్యాయం చేశారు. బీసీ మహిళలకు పోస్టులు లేకుండా పోయాయి. సవరించి మళ్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి అని మండిప‌డ్డారు.

ALSO READ: Sridhar Reddy: బండి సంజయ్‌కి బడిత పూజ తప్పదు