Aroori Ramesh: షాకింగ్.. ఎమ్మెల్యేను ఎత్తుకెళ్లిన BRS నేత‌లు

Aroori Ramesh: భార‌త రాష్ట్ర స‌మితి నేత ఆరూరి ర‌మేష్ భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అవ్వాల‌నుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి.. భార‌త రాష్ట్ర స‌మితిని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీని పొగుడుతూ ఆ పార్టీలో చేరాల‌ని అనుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయ‌న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండ‌గానే.. ఇత‌ర భార‌త రాష్ట్ర స‌మితి నేత‌లు వ‌చ్చి ఆయ‌న్ను మాట్లాడనివ్వ‌కుండా బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లారు. దాంతో ఈ విష‌యం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాంతో ఆరూరి ర‌మేష్ ఇంటి వ‌ద్ద హైడ్రామా నెల‌కొంది.

ఎర్ర‌బెల్లి దయాక‌ర‌రావు, బ‌స్వ‌రాజు సార‌య్యలకు ఆరూరి ర‌మేష్ ప్రెస్ మీట్ పెడుతున్న‌ట్లు స‌మాచారం అందింది. దాంతో వెంట‌నే ఆయ‌న ఇత‌ర కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ర‌మేష్ ఇంటికి వెళ్లి ప్రెస్ మీట్ వ‌ద్దు లోప‌లికి రండి మాట్లాడుకుందాం అని చెప్పారు. ఇందుకు ఆయ‌న ఒప్పుకోక‌పోగా బ‌ల‌వంతంగా మీడియా చూస్తుండ‌గానే ఇంట్లోకి తీసుకెళ్లి బుజ్జ‌గింపులు చేస్తున్నారు. వారు ఎంత బుజ్జిస్తున్నా ఆరూరి ర‌మేష్ భార‌త రాష్ట్ర స‌మితిలో ఉండేందుకు ఒప్పుకోవ‌డంలేద‌ని తెలుస్తోంది.

ALSO READ: Raja Singh: BJPకి రాజా సింగ్ రాం రాం?