BRS: అనుకోకుండా గెలిచి మగాడు అనుకుంటున్నాడు
Hyderabad: తాండూరులో BRS నాయకుల లొల్లి ఎక్కువైంది. తాండూరు (tandur) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని (mahender reddy) ఔట్ డేటెడ్ అనడంతో ఆయన సీరియస్ అయ్యారు. పార్టీ మారినప్పుడే రోహిత్ రెడ్డి (rohit reddy) ఔట్ డేటెడ్ అయ్యాడని అనుకోకుండా గెలిచి మొనగాడు అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఆయన గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయ్యాడని టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో తెలుస్తుందని అన్నారు. ఆయన మాటలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అధిష్టానం తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిందని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.