Telangana Elections: ప్రచారానికి కేటీఆర్, కేసీఆర్ సిద్దం.. BRS ప్లాన్ ఇదే!
Hyderabad: తెలంగాణ ఎన్నికలకు(telangana elections) సరిగ్గా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలో ప్రజల మధ్యకు వెళ్తున్నాయి. ఇక అధికార BRS మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే… ఆ పార్టీ ఇప్పుడు బలమైన BJP, కాంగ్రెస్ (congress) పార్టీలను ఎదుర్కొనబోతోంది. దీంతో ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తోంది. ఇక తాజాగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో BRS నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తొలుత మంత్రి కేటీఆర్, ఆ తర్వాత KCR పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు.
మరికొన్ని రోజుల్లో మంత్రి KTR పర్యటన ప్రారంభమవుతుందని బీఆర్‌ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆయన పర్యటనలో భాగంగా ఒక్కో నియోజకవర్గం నుంచి బరిలో దిగే.. ఇద్దరు నాయకులను ఎంపిక చేయనున్నారు. ఈలోపు ఇద్దరూ ప్రజలకు ఏమేరకు దగ్గరగా ఉంటున్నారు. ప్రజలతో సఖ్యతగా ఉంటున్నారా లేదా.. అన్న అంశాలను పరిశీలించనున్నారు. దీని తర్వాత కేసీఆర్ పర్యటన ఉండనుంది. ఆయన ఫైనల్ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనున్నారు. ఇలా రెండు దఫాలుగా రిపోర్టులు తెప్పించుకుని.. అభ్యర్థులను ఎంపిక చేస్తారని టాక్ నడుస్తోంది. దీంతోపాటు కొందరు సిట్టింగులకు ఈసారి సీటు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి నాయకులల్లో ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. మరి వారిలో ఎవరికి సీటు ఇస్తారు అన్నది తేలాల్సి ఉంది.