Shakeel: పారిపోయాడా.. తప్పించారా.. షకీల్ కుమారుడి కేసులో ట్విస్ట్‌లు
Shakeel: హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వద్ద అర్థరాత్రి ఓ కారు హల్‌చల్ సృష్టించింది. ప్రజా భవన బారికేడ్లపైకి కారు దూసుకెళ్లింది. ఆరా తీయగా ఆ కారు BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిది అని తేలింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని షకీల్ కుమారుడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మరుసటి రోజు ఉదయానికే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం అతను తప్పించుకున్నాడు అని చెప్తున్నారు. అతని తండ్రే బెదిరించి తప్పించి ఉంటాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షకీల్ కుమారుడితో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నిందితుడు బాగా తాగి ఉన్నాడు.