Brij Bhushan: అలా హగ్ చేసుకుంటే తప్పు కాదు
Delhi: రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (brij bhushan) కోర్టులో చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. పలువురు మహిళా రెజ్లర్ల (wrestlers protest) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్‌పై (brij bhushan sharan singh) కొంతకాలంగా కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఢిల్లీలోని కోర్టులో హాజరైన బ్రిజ్ భూషణ్.. తాను చేసిన తప్పులను సమర్ధించుకుంటూ.. ఒక అమ్మాయిని పర్మిషన్ లేకుండా సెక్సువల్ ఉద్దేశంతో కాకుండా మామూలుగా హగ్ చేసుకుంటే తప్పు లేదు అని చెప్పారు. దాంతో కోర్టులోని వారంతా నోరెళ్లబెట్టారు.
అప్పుడే ఎందుకు కేసులు పెట్టలేదు?
బ్రిజ్ భూషణ్ (brij bhushan) తరఫు వాదిస్తున్న అడ్వొకేట్ మోహన్ వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి.. ఆయనపై పెట్టిన కేసులు ఇప్పుడు చెల్లవని.. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని వాదించారు. కెరీర్లు నాశనం అవుతాయన్న కారణంతోనే కేసులు పెట్టలేదని రెజ్లర్లు చెప్తున్నారని, అది కన్విన్సింగ్‌గా లేదని అన్నారు. రెజ్లింగ్‌కి సంబంధించిన ఈవెంట్లలో మహిళా రెజ్లర్లకు ఎక్కువగా మేల్ కోచ్‌లే ఉంటారని, మెచ్చుకోవడానికి హగ్ చేసుకోవడంలో తప్పేముందని వాదనలు వినిపించారు.
టీవీల్లో చూస్తుంటాం కదా..
అడ్వొకేట్ మోహన్ వాదనలు వినిపిస్తూ.. “” మనం టీవీల్లో చూస్తుంటాం కదా.. ఫీమేల్ రెజ్లర్లను మెచ్చుకోవడానికో.. వారు భయపడుతుంటే ధైర్యం చెప్పడానికో హగ్ చేసుకుంటుంటారు. భుజాలపై తడుతుంటారు. దానికే అసభ్య ప్రవర్తన అని కేసులు ఎలా పెడతారు? ఇండియాలోనే కాదు ఎక్కడైనా రెజ్లింగ్‌లో కోచ్‌లు ఎక్కువగా మగవారే ఉంటారు. మరో విషయం ఏంటంటే.. ఎవరైతే నా క్లైంట్ బ్రిజ్ భూషణ్‌పై కేసులు పెట్టారో…అవి జకార్తా, మంగోలియాలో జరిగిన మ్యాచ్‌ల సమయంలో జరిగిన ఘటనలు. అక్కడ జరిగిన సంఘటనలపై ఇండియాలో కేసులు పెట్టలేరు “” అని అన్నారు. (brij bhushan)
వాటిని కొనసాగే తప్పులు అనలేం
ఇక్కడ అడ్వొకేట్ మనోజ్ మరో పాయింట్ తీసారు. ఏవైతే తప్పులు, నేరాలు అని రెజ్లర్లు అంటున్నారో వాటిని బ్రిజ్ భూషణ్ ఇప్పటివరకు కొనసాగేలా చేస్తుంటే అప్పుడు చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అంతేకానీ.. ఒక సందర్భంలో మెచ్చుకోవడానికో, ధైర్యం చెప్పడానికో చేసిన చర్యను తప్పు, నేరం కింద పరిగణించలేం అని స్పష్టం చేసారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన బ్రిజ్ భూషణ్‌కు ఏ సందర్భంలోనూ ఇండియా దాటి వెళ్లడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. వాదోపవాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.