Brij Bhushan: ఎక్క‌డ ఛాన్స్ దొరికినా అమ్మాయిల‌ను వ‌ద‌ల్లేదు

రెజ్ల‌ర్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (wfi) చీఫ్, BJP ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ (brij bhushan) గురించి ఢిల్లీ పోలీసులు కోర్టులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించాడు. బ్రిజ్ భూషణ్‌కు ఎక్క‌డ ఎప్పుడు అవ‌కాశం దొరికినా మ‌హిళా రెజ్ల‌ర్లను లైంగికంగా వేధించాడ‌ని త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాలు కేసుకు స‌రిపోతాయని తెలిపారు. త‌జికిస్థాన్‌లో రెజ్లింగ్ పోటీలు జరుగుతున్న స‌మ‌యంలో బ్రిజ్ భూష‌న్ ఓ మ‌హిళా రెజ్ల‌ర్‌ను త‌న రూంలోకి పిలిపించుకుని వాటేసుకున్నాడ‌ని అత‌ను ఏం చేస్తున్నాడో బాగా తెలిసే చేసాడ‌ని ఢిల్లీలోని రైజ్ అవెన్యూ కోర్టులో పోలీసులు వెల్ల‌డించారు.

అయితే బ్రిజ్ భూష‌ణ్ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్ధించుకుంటూ ఒక తండ్రి స్థానంలో ఉండి అలా కౌగిలించుకున్నానే త‌ప్ప వేరే దురుద్దేశంతో కాద‌ని అన్నాడు. ఈ వివ‌ర‌ణ‌ను కోర్టు ఒప్పుకోలేదు. ఇప్ప‌టివ‌ర‌కు బ్రిజ్ భూష‌ణ్‌పై న‌మోదైన అన్ని కేసుల‌ను ఒకే కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఎప్పుడైతే కేంద్ర ప్ర‌భుత్వం బ్రిజ్ భూష‌ణ్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను విచారించేందుకు ప్ర‌త్యేక క‌మిటీ వేసిందో.. ఆ క‌మిటీలో ఏవీ రుజువు చేయ‌లేక‌పోయారని కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క‌మిటీకి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోం (mary kom) నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్ పోలీసుల‌కు అప్ప‌గించారు. వాదోప‌వాదాలు విన్న న్యాయ‌స్థానం త‌దుప‌రి హియ‌రింగ్‌ను అక్టోబ‌ర్ 7కు వాయిదా వేసింది. (brij bhushan sharan singh)