Botsa Satyanarayana: YSRCPకి గుడ్ బై.. జ‌గ‌న్ స్పంద‌న!

Botsa Satyanarayana to say good bye to ysrcp

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్‌లో పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. మొన్న ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టేందుకే పార్టీ ఆయ‌న్ను ఉప‌యోగించుకుంది. మొన్న అధికార పార్టీపై బొత్స తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి చేసిన కామెంట్స్ పార్టీని విస్మ‌యానికి గురిచేసాయ‌ట‌. అధికార కూట‌మి ప్ర‌భుత్వం పెన్ష‌న్‌ను రూ.4000 చేయ‌డం మంచిదే అని ఆయ‌న స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు షాక‌య్యారు. అంతేకాకుండా ప్ర‌జ‌లు త‌మ‌ను వ్య‌తిరేకించ‌డంతోనే ఓడిపోయామ‌ని చెప్పి షాక్‌కు గురిచేసారు.

అధికార కూట‌మి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు వారికి మ‌రింత శ‌క్తి ఇవ్వాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. దాంతో బొత్స మెల్లిగా పార్టీ జంప్ అయ్యేందుకే ఇత‌ర పార్టీల‌పై ఎలాంటి కామెంట్స్ చేయ‌డంలేద‌నే టాక్ తాడేప‌ల్లిలో వినిపిస్తోంది. ఆల్రెడీ చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు ఇత‌ర పార్టీ నుంచి కాల్స్ వ‌స్తున్నాయ‌ని నిన్న జ‌రిగిన స‌మావేశంలో నేత‌లు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జ‌గ‌న్ స్పందిస్తూ.. వెళ్లాల‌నుకునేవారిని ఎంత‌వ‌ర‌కు ఆప‌గ‌లం అని ప్ర‌శ్నించారు. నైతిక‌త ఉన్న‌వారు త‌న‌తోనే ఉంటార‌ని.. వెళ్లాల‌నుకునేవారు వెళ్లిపోవచ్చ‌ని సూచించారు. పార్టీ పెట్టిన‌ప్పుడు త‌న‌తో పాటు త‌న త‌ల్లి విజ‌య‌మ్మ మాత్ర‌మే ఉన్నార‌ని… ఇప్పుడు కూడా మొద‌టి నుంచి మొదలుపెడ‌తాన‌ని చెప్పారు.