Botsa Satyanarayana: కేంద్రంలో మా మీద ఆధారపడే ప్రభుత్వం రావాలి
Botsa Satyanarayana: ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలని మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించగా.. తమ ప్రభుత్వంపై ఆధారపడే ప్రభుత్వం రావాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పడం షాకింగ్ అంశంగా మారింది. మొన్న జరిగిన పోలింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాలకు 175 స్థానాలతో పాటు 34 పార్లమెంటరీ స్థానాలకు గానూ 34 కొట్టబోతున్నామని తెలిపారు. ఒకటో రెండో సీట్లు పోతే దాని గురించి ప్రెస్ మీట్ గురించే చెప్తానని అన్నారు. అంటే బొత్స సత్యనారాయణ ఉద్దేశం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీపై ఆధారపడి ఉండదని ఇన్‌డైరెక్ట్‌గా అంటున్నారని విశ్లేషకుల టాక్.