Botsa Satyanarayana: ఇప్ప‌టికీ మా రాజ‌ధాని విశాఖే

Botsa Satyanarayana says vizag is still the capital of ap

Botsa Satyanarayana: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి తెలుగు దేశం పార్టీ వ‌చ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని అని నిర్ణ‌యించేసారు. అక్క‌డ నిర్మాణ కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు మొద‌లైపోయాయి. అయిన‌ప్ప‌టికీ త‌మ పార్టీ ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విశాఖ‌ప‌ట్న‌మే అని భీష్మించుకుని కూర్చున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు. విశాఖ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్ప‌టికీ త‌మ పార్టీ ప్ర‌కారం విశాఖే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని.. కొత్త ప్ర‌భుత్వం వచ్చినంత మాత్రాన త‌మ పార్టీ విధానాల‌ను మాత్రం మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ప‌గ‌లు త‌ర్వాత రాత్రి రాత్రి త‌ర్వాత ప‌గ‌లు ఎలా వ‌స్తాయో రాజ‌కీయ పార్టీలు అలా వ‌చ్చిపోతుంటాయ‌ని అన్నారు.