Botsa Satyanarayana: పవన్..ట్యూషన్ చెప్తా రా..!
AP: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana).. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) ట్యూషన్ చెప్తానని అంటున్నారు. నిన్న ప్రభుత్వంపై పవన్ ట్వీట్ చేస్తూ ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదని, టీచర్లను నియమించడాలు లేదా ట్రైనింగ్ ఇవ్వడాలు చేయడంలేదని ఆరోపించారు. కానీ నష్టపోతున్న చిన్న కంపెనీలకు మాత్రం కోట్లు విలువ చేసే కాంట్రాక్టులు వస్తున్నాయని ఈ విషయంలో వైసీపీ స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించిందా అని ప్రశ్నించారు. టెండర్‌కి అప్లై చేసిన కంపెనీలు ఎన్ని వాటిలో షార్ట్ లిస్ట్ అయినవి ఎన్ని అని అడిగారు. ఈ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయోలేదో వైసీపీ చెప్పాలని డిమాండ్ చేసారు.
ఈ ట్వీట్‌పై బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. ఈరోజు నుంచి పవన్ కళ్యణ్‌కు ట్యూషన్ చెప్పాలని అనకుంటున్నానని, కాకపోతే పవన్ సరైన హోంవర్క్ చేసుకుని వస్తేనే ట్యూషన్ చెప్తానంటూ బొత్స వెటకారంగా ఆన్సర్ ఇచ్చారు. ఈరోజు తాను పవన్‌కి ఇచ్చే అసైన్‌మెంట్స్ ఈ 7 లెసన్స్ సరిగ్గా చదువుకోవడమేనని అన్నారు.
లెసన్ 1: పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారాన్ని వదులుకుని ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ ఒక్క ప్రభుత్వం కూడా చెయ్యలేని పని చేస్తోంది.
లెసన్ 2: రూ.100 కోట్లకు పైగా విలువైన ఏ ప్రభుత్వ టెండర్ అయినా హైకోర్టు ఎపాయింట్ చేసే స్పెషల్ జడ్జి ఎంపిక చేస్తారు.
లెసన్ 3: టెండర్‌కు సంబంధించిన అన్ని వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. ఆ టెండర్‌పై స్పందించాలన్నా, ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కంపెనీలకు 21 రోజులు గడువు ఇస్తాం.
లెసన్ 4: ఈ టెండర్ కోసం ఏ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంగేజ్ అయ్యి ఉన్నానో కనీసం గూగుల్ నుంచి సెర్చ్ చేస్తే వివరాలు తెలుస్తాయి. మీకోసం నేను ఆ లింక్‌ను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.
లెసన్ 5: ఇక ఏపీ విద్యా విధానం విషయానికొస్తే.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని వివరాలను ప్రజలకు తెలియజేసేలా పనిచేస్తున్న ఏకైక శాఖ ఇదే.
లెసన్ 6: నువ్వు ప్రజల్లోకి వచ్చి తప్పుడు సమాచారలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు నీకు చదువు చెప్పిన టీచర్లు కూడా సిగ్గుపడుతుంటారు. కానీ ఇంతకుముందు నేను అన్నట్లుగా.. నీకు ట్యూషన్స్ చెప్తాను. కాకపోతే నువ్వు కాస్త బుర్ర ఉపయోగిస్తేనే నీకు ట్యూషన్స్ చెప్పగలను అని బొత్స పవన్‌పై భారీ ట్వీట్లు విసిరారు. (botsa satyanarayana)